: హెచ్1బీ వీసాలకు పెద్ద ఎత్తున పోటీ


అమెరికా ఆర్థిక వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుండడంతో ఈ ఏడాది హెచ్1బీ వీసాలకు డిమాండ్ మరింతగా పెరిగిపోయింది. ఈ నెలారంభం నుంచి దరఖాస్తులకు ఆహ్వానం పలకడంతో భారత్ సహా వివిధ దేశాల వారు పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకున్నారు. దీంతో 65వేల వీసాలను మంజూరు చేయనుండగా, దరఖాస్తులు మాత్రం భారీగా 1.72లక్షలు వచ్చి చేరాయి. గతేడాది కూడా ఇంతే మొత్తంలో వీసాలను జారీ చేయగా... అప్పుడు 1.24లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఈసారి ఆ డిమాండ్ 40 శాతం పెరిగిపోవడం విశేషం. అమెరికా కంపెనీల మానవ వనరుల అవసరాలు తీర్చేందుకు అక్కడి ప్రభుత్వం ఏటా ఈ వీసాలను జారీ చేస్తూ వస్తోంది. అలాగే, ప్రత్యేక డిగ్రీలు కలిగిన వారికి అదనంగా 20వేల హెచ్1బీ వీసాలు జారీ చేయడానికి అవకాశం ఉంది. ప్రత్యేక నైపుణ్యం కలిగిన వారి కోసం ఎల్1బీ వీసాలను జారీ చేస్తుంటారు.

  • Loading...

More Telugu News