: జేడీకి జై కొట్టిన మారెప్ప
అక్రమాస్తుల కేసులో తమ అధినాయకుడు జగన్ ను జైలుకు పంపిన సీబీఐ అంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలకు ఎంత ఉక్రోషమో అందరికీ తెలిసిందే. అయితే, ఈరోజు ఓ అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. సీబీఐ జేడీ లక్ష్మీ నారాయణ, వైఎస్సార్సీపీ నేత మారెప్ప ఒకే వేదికను పంచుకుని చూపరులను ఆశ్చర్యంలో ముంచెత్తారు. కర్నూల్ జిల్లా నంద్యాల శాంతిరాం వైద్య కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో వీరిద్దరూ పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో మారెప్ప మాట్లాడుతూ, సీబీఐ జేడీపై ప్రశంసల జల్లు కురిపించారు. అనివీతి పరుల గుండెల్లో రైళ్ళు పరిగెత్తిస్తున్న జేడీ పనితీరు భేష్ అంటూ ఆయనపై పొగడ్తల వర్షం కురిపించారు. ఈ వ్యాఖ్యలు జగన్ చెవిన పడితే మారెప్ప భవిష్యత్తు ఎలా ఉంటుందో మరి !!