: 17న నామినేషన్ వేయనున్న జగన్
ఈ నెల 17న వైఎస్సార్సీపీ అధినేత జగన్ కడప జిల్లా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్ వేయడానికి ఆయన భాకరాపురంలోని నివాసం నుంచి వైకాపా నేతలు, కార్యకర్తలతో ర్యాలీగా బయలుదేరుతారు. పూలంగళ్ల వద్ద ప్రసంగిస్తారు. అనంతరం ఎన్నికల రిటర్నింగ్ అధికారిని కలసి నామినేషన్ వేస్తారు.