: తెలంగాణ ప్రజలు తమ తలరాత తామే రాసుకుంటారు: కేసీఆర్
తెలంగాణ ప్రజలు తమ తలరాత తామే రాసుకుంటారని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. కరీంనగర్ లో జరుగుతున్న టీఆర్ఎస్ ఎన్నికల శంఖారావం సభలో ఆయన మాట్లాడుతూ, టీఆర్ఎస్ నూటికి నూరు శాతం సెక్యులర్ పార్టీ అని తెలిపారు. ఎట్టిపరిస్థితుల్లోను ఎన్డీఏ కూటమిలో చేరే ప్రసక్తి లేదన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందన్న లెక్కలు తప్పని ఆయన అన్నారు. మూడో కూటమి నేతలు తనతో మాట్లాడుతున్నారని, ఆ కూటమిలో భాగస్వాములం అవుతామని కేసీఆర్ అన్నారు. టీఆర్ఎస్ ను కాంగ్రెస్ లో విలీనం చేయవద్దని తెలంగాణ సమాజమే చెప్పిందన్నారు. అమరవీరుల కుటుంబాలను తమ గుండెల్లో పెట్టుకుంటామన్నారు. మహిళా రుణాలను రద్దుచేస్తామని, బలహీన వర్గాలకు ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పిన ఆయన, టీఆర్ఎస్ ఎన్నికల ప్రణాళికను అందరూ క్షుణ్ణంగా చదవాలని సూచించారు.