: సోమవారం నుంచే పెరిగిన విద్యుత్ ఛార్జీలు అమల్లోకి.. ఇదీ వరస..


విద్యుత్ చార్జీలను పెంచుతూ సర్కారు ఇటీవల నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. పెరిగిన విద్యుత్ చార్జీలు ఎల్లుండి (సోమవారం) నుంచి అమల్లోకి వస్తాయి. దీనికి సంబంధించి 2013-14 సంవత్సరానికి విద్యుత్‌ టారీఫ్‌ను ఈఆర్‌సీ  విడుదల చేసింది. వ్యవసాయ సేవా రుసుంలో ఎలాంటి మార్పులు చేయలేదు. 50 యూనిట్ల లోపు వినియోగం చేసే వారిపట్ల ఈఆర్‌సీ కనికరం చూపింది. వ్యవసాయ విద్యుత్‌లో ఎలాంటి మార్పులు లేవని ప్రకటించింది. గతంలో గృహ వినియోగానికి 6 శ్లాబ్‌లు ఉండగా ప్రస్తుతం 10 శ్లాబ్‌లకు పెంచింది.
పెరిగిన శ్లాబుల వివరాలిలాఉన్నాయి : 
   1 నుంచి  50 యూనిట్లు రూ. 1.45
 51 నుంచి  100 యూనిట్లు రూ. 2.60
101 నుంచి 150 యూనిట్లు రూ. 3.25
151 నుంచి 200 యూనిట్లు రూ. 4.88
201 నుంచి 250 యూనిట్లు రూ. 5.63
251 నుంచి 300 యూనిట్లు రూ. 6.38
301 నుంచి 400 యూనిట్లు రూ. 7.38
401 నుంచి 500 యూనిట్లు రూ. 7.88
501 ఆ పైన యూనిట్ కు రూ. 8.38 

  • Loading...

More Telugu News