: యువరాజు కోసం సోదరి ప్రచారం
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విజయం కోసం ఆయన సోదరి ప్రియాంక వాద్రా ప్రచారం చేయనున్నారు. ఈ నెల 15 నుంచి రెండు రోజుల పాటు అమేథీ నియోజకవర్గంలో ప్రియాంక పర్యటించనున్నారు. తన పర్యటనలో ఆమె బహిరంగ సభల్లో పాల్గొనడమే కాకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కూడా సమావేశమవుతారని అమేథీ నియోజకవర్గ ఇన్ చార్జ్ చంద్రకాంత్ దూబె తెలిపారు.