: కన్నీరు పెట్టిన కర్నే ప్రభాకర్


టీఆర్ఎస్ నేత కర్నే ప్రభాకర్ కన్నీరు పెట్టుకున్నారు. కేసీఆర్ పై అపవాదులు వేస్తూ పార్టీని వీడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, పధ్నాలుగేళ్లుగా తెలంగాణ కోసం కేసీఆర్ పోరాటం చేస్తున్నారని అన్నారు. ఎన్నికల తరువాత కాంగ్రెస్ లో కలిపేస్తామని చెబుతున్నారని, అలా జరగదని ఆయన అన్నారు. పార్టీని వీడుతున్న వారిని చూస్తుంటే బాధేస్తుందని ఆయన తెలిపారు. ఎంత మంది పార్టీని వీడినా తాను పార్టీ వీడనని ఆయన స్పష్టం చేశారు. కేసీఆర్ తమను సొంత బిడ్డల్లా చూశారని ఆయన చెప్పారు. కేసీఆర్ కు తమకు ఉన్న అనుబంధం చాలా బలమైనదని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News