: ఏప్రిల్ 1 నుంచి భారత్ లో సునీత విలియమ్స్ పర్యటన


భారతీయ అమెరికన్ వ్యోమగామి సునీత విలియమ్స్ ఏప్రిల్ 1 నుంచి భారత్ లో పర్యటించనున్నారు. ఈ పర్యటనను దేశ రాజధాని ఢిల్లీ నుంచి ప్రారంభిస్తారు. సునీత ముందుగా 'జాతీయ సైన్స్ కేంద్రాన్ని' (ఎన్ఎస్ సి) సందర్శిస్తారు. అనంతరం ఎంపిక చేసిన కొందరు విద్యార్ధుల బృందం, ఉపాధ్యాయులతో ఆమె సమావేశమవుతారని ఎన్ఎస్ సి తెలిపింది. ఈ సందర్భంగా పలు విషయాలపై విద్యార్ధులు అడిగే ప్రశ్నలకు సునీత సమాధానాలు ఇస్తారు.

అక్కడి నుంచి బయలుదేరి ఏప్రిల్ 3, 4 తేదీల్లో ఆమె దేశ ఆర్ధిక రాజధాని
 ముంబయిలో పర్యటిస్తారు. ఇక్కడి చెంబూర్ లో 'ఇండియన్ కౌన్సిల్ సోషల్ వెల్ఫేర్' సంస్థ నిర్వహిస్తున్న మహిళా వసతి గృహాన్ని సందర్శిస్తారు. తర్వాత కొంతమంది విద్యార్ధులు, స్థానికులతో సునీత కొంతసేపు గడుపుతారు. చివరిగా తన పూర్వీకులు, బంధువులు ఉన్న గుజరాత్ లో పర్యటిస్తారు. సునీత తండ్రి ఈ రాష్ట్రంలోని మేహసనా జిల్లాకు చెందిన వ్యక్తి. ఇక్కడ చుట్టాలను, కుటుంబ మిత్రులను ఆమె కలుస్తారు.

అనంతరం గతంలో 
తాను గౌరవ డాక్టరేట్ డిగ్రీని పొందిన 'గుజరాత్ టెక్నికల్ యూనివర్శటీ' విద్యార్ధులతో సునీ సమావేశమై ప్రసంగిస్తారు. 2007 అక్టోబర్ లో ఆమె చివరిసారిగా భారత్ ను సందర్శించారు. గత ఏడాది నిర్వహించిన అంతరిక్షయానంలో సునీత నాలుగు నెలలు గడిపి రికార్డు సృష్టించి సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News