: వైభవంగా శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు
తిరుమలలో శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉదయం శ్రీవారి ఆలయం నుంచి శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి తిరుమాడ వీధుల్లో వూరేగుతూ ఉత్సవ మండపానికి చేరుకున్నారు. అక్కడ ఉత్సవ మూర్తులకు వసంత్యుత్సవ అభిషేక నివేదనలను అర్చకులు నిర్వహించారు. అనంతరం స్వర్ణ తిరుచ్చి వాహనంపై ఉత్సవ మూర్తులను ఆలయానికి ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఈ ఉత్సవంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి దంపతులు పాల్గొన్నారు.