: టీకాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల
తెలంగాణ ప్రాంతానికి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. కేంద్ర మంత్రి జైరాం రమేష్ మేనిఫెస్టోలో పొందుపరచిన అంశాలను వెల్లడించారు. మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు.
* తొలి ఏడాదిలో లక్ష ఉద్యోగాలు.
* మూడేళ్లలో జిల్లాకు లక్ష ఉద్యోగాలు.
* ప్రాణహిత-చేవెళ్ల, పాలమూరు ఎత్తిపోతల పథకాలకు జాతీయ హోదా సాధించేందుకు కృషి.
* చిన్న, సన్నకారు రైతులకు ఎకరానికి రూ. 10 వేల ప్రోత్సాహకం.
* అమరవీరులకు రూ. 100 కోట్లతో ప్రొ.జయశంకర్ ట్రస్ట్ ఏర్పాటు.
* జూన్ 2న తెలంగాణ అమరవీరుల సంస్మరణ దినం.
* మహిళా సంఘాలకు రూ. లక్ష ప్రోత్సాహకం.
* రైతులకు పగటి పూట విద్యుత్ సరఫరా.
* ప్రతి రెవెన్యూ డివిజన్ లో పాటిటెక్నిక్, ఐటీఐ కాలేజీలు.
* తెలంగాణలో పింఛన్ల మొత్తం పెంపు.
* సౌర విద్యుత్ వినియోగానికి పెద్ద పీట.
* రూ. 500 కోట్లతో యువతకు ప్రత్యేక బ్యాంకు.
* ఆరోగ్యశ్రీ తరహాలో మరింత మెరుగైన ఆరోగ్య విధానం.
* బెల్టు షాపులు రద్దు చేస్తాం.
* లంబాడా తండాలకు పంచాయతీ హోదా కల్పిస్తాం.
* కొత్తగా 8 నుంచి 10 జిల్లాల ఏర్పాటు.
* జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు.
* వృద్ధులు, వింతంతువుల పెన్షన్ వెయ్యికి పెంపు.
* గ్రామాల్లో ఇల్లు లేని వారికి పది సెంట్ల భూమి.
* మైనార్టీకీ సబ్ ప్లాన్ అమలు.
* గిరిజన యూనివర్శిటీ ఏర్పాటు.
* సింగరేణిలో ఉద్యోగాలు స్థానికులకే.
* ఒలంపిక్ గేమ్ నిర్వహణే లక్ష్యంగా మౌలిక వసతుల ఏర్పాటు.
* ప్రతి జిల్లాలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల ఏర్పాటు.
* ముస్లింలను బీసీ కేటీగిరీలో చేర్చడం.
* బీసీ యాక్షన్ ప్లాన్ అమలు.
* విదేశాల్లో చదువుకునే విద్యార్థులకు నామమాత్రపు వడ్డీకి రుణాలు.
* ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ పట్టభద్రులు ప్రభుత్వ ఉద్యోగం పొందేంతవరకు రూ. 10 వేల భృతి.
* గల్ఫ్ లో మరణించిన వారికి ఎక్స్ గ్రేషియా. గల్ఫ్ వెళ్లేవారికి బీమా సదుపాయం.
* రాష్ట్ర పండుగలుగా బతుకమ్మ, మేడారం జాతరలు.
* బ్రాండ్ హైదరాబాద్ ఇమేజ్ ప్రమోట్ చేయడానికి ప్రణాళికలు.