: ఓటు బ్యాంకు రాజకీయాలకు ఫుల్ స్టాప్ పెట్టండి: మోడీ


దేశాన్ని కాపాడాలంటే ఓటు బ్యాంకు రాజకీయాలకు పుల్ స్టాప్ పెట్టాలని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ అన్నారు. రాజస్థాన్ రాష్ట్రంలోని బర్మేర్ ఎన్నికల ప్రచార సభలో మోడీ పాల్గొని ప్రసంగించారు. బర్మేర్ కు సాగునీరు అందించాలన్న వాజ్ పేయి కలను సాకారం చేస్తామని ఆయన చెప్పారు. దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న జిల్లాల్లో కచ్ ఒకటని ఆయన అన్నారు. కాంగ్రెస్ తనను ఏదో ఒక రకంగా అడ్డుకోవాలని చూస్తోందని మోడీ ఆరోపించారు. దేశంలోని సామాన్య ప్రజలకే కాదు... దేశ సరిహద్దుల్లో పనిచేస్తున్న జవాన్లకు కూడా తాగునీరు సరఫరా చేస్తున్నట్లు మోడీ చెప్పారు.

  • Loading...

More Telugu News