: ఏప్రిల్ 9 బంద్ కు టీడీపీ మద్దతు
రాష్ట్రంలో విద్యుత్ సరఫరా సమస్యా.. ఛార్జీల పెంపుకు నిరసనగా వామపక్షాలు తలపెట్టిన బంద్ కు తెలుగుదేశం పార్టీ బాసట గా నిలుస్తుంది. ఫలితంగా, ఏప్రిల్ 9వ తేదీన లెఫ్ట్ పార్టీలు నిర్వహిస్తోన్న రాష్ట్ర బంద్ లో టీడీపీ శ్రేణులు కూడా పాల్గొంటాయి. ఇవాళ అసెంబ్లీ టీడీఎల్పీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఈ భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. విద్యుత్ సమస్య మీద ఇటీవల అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో విడుదల చేసిన నిరసన పత్రాన్ని గ్రామ స్థాయిలోకి సైతం తీసుకువెళ్లాలని భేటీలో నిర్ణయించారు. సమావేశానంతరం వివరాలను టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర మీడియాకు వెల్లడించారు.