: ములాయం బాటలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అబుఅజ్మీ


వివాదాస్పద వ్యాఖ్యలు చేసి సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ కి తగ్గ శిష్యుడినని అనిపించుకున్నారు మహారాష్ట్ర సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అబుఅజ్మీ. ముంబైలో ఆయన మాట్లాడుతూ, అత్యాచారం శిక్షార్హమైన నేరమేనని, అయితే ఈ నేరాల్లో కేవలం పురుషులు మాత్రమే శిక్ష అనుభవిస్తున్నారని... పురుషులతో పాటు స్త్రీలను కూడా ఉరి తీయాలని అన్నారు. ఆధునిక చట్టాలు పురుషుడుని మాత్రమే శిక్షిస్తూ, స్త్రీని వదిలేస్తున్నాయని తెగ బాధపడిపోయారు. దీంతో ఆయన చిక్కుల్లో పడ్డారు.

  • Loading...

More Telugu News