: విశాఖ ప్రజలకు సేవ చేస్తా : సుబ్బిరామిరెడ్డి
ప్రాణం విడిచేంతవరకు విశాఖ ప్రజలకే సేవ చేస్తానని కాంగ్రెస్ నేత టి.సుబ్బిరామిరెడ్డి అంటున్నారు. విశాఖకే తన జీవితం అంకితం చేస్తానని చెబుతున్నారు. శనివారం విశాఖలో విలేకరులతో మాట్లాడిన టీ ఎస్సార్ , విశాఖ ఎప్పటికీ తనదేనని, అక్కడినుంచే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. మంత్రి పురంధేశ్వరికి నర్సరావుపేట ఉండగా ఇక్కడేం పనని ఆయన ప్రశ్నించారు.