: అది తప్పుకాదు...నేరమని ములాయం తెలుసుకోవాలి: నిర్భయ తల్లిదండ్రులు


మొరాదాబాద్ లో సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై నిర్భయ తల్లిదండ్రులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాజస్థాన్ లో వారు మాట్లాడుతూ, అత్యాచారం అనేది అబ్బాయిలు చేసే తప్పు కాదని, అది వారు చేసే నేరం అన్న విషయాన్ని ములాయం సింగ్ యాదవ్ గుర్తించాలని అన్నారు. కుమార్తెలను కన్నవారికి, అత్యాచారం అంటే ఏమిటో అనుభవించిన వారికే దాని బాధ తెలుస్తుందని అన్నారు.

అధికార, అర్థ బలంతో అహంకారం నిండిన ములాయం సింగ్ యాదవ్ కు ఆ భాధ ఎలా తెలుస్తుందని వారు ప్రశ్నించారు. తనను తాను ప్రధానినని చెప్పుకునే వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని వారు ఎద్దేవా చేశారు. ఇలాంటి నేతలు ఉన్నందువల్లే మహిళల భద్రత దిగజారిపోతోందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి నేతలను ఎన్నుకోకుండా ప్రజలు జాగ్రత వహించాలని వారు పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News