: మోడీ వ్యతిరేకులు అమెరికాలో ఒక్కటవుతున్నారు


దేశ భావి ప్రధానిగా పేరు వినిపిస్తున్న గుజరాత్ సీఎం మోడీకి వ్యతిరేకంగా అమెరికాలో ప్రజాప్రతినిధులు ఒక్కొక్కరు చేయి కలుపుతున్నారు. గుజరాత్ లో 2002నాటి గోద్రా రైలు దుర్ఘటన తర్వాత జరిగిన అల్లర్లలో ఒక మతవర్గం వారు అధిక సంఖ్యలో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. దీంతో మోడీకి వీసా జారీ చేయరాదని అమెరికా 2005లో నిషేధం విధించింది. అయితే, ప్రస్తుతం భారత్ లో జరుగుతున్న ఎన్నికల్లో ఎన్డీయే తగినంత ఆధిక్యంతో తిరిగి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్న అంచనాల నేపథ్యంలో అమెరికా నాటి నిషేధ ఉత్తర్వులపై వెనక్కి తగ్గింది. అయితే, మోడీకి వీసా జారీ చేయరాదన్న విధానాన్ని అలాగే కొనసాగించాలని అమెరికా ప్రభుత్వాన్ని కోరుతూ డెమొక్రటిక్ సెనేటర్ కీత్ ఎల్లిసన్, రిపబ్లికన్ పార్టీ సెనేటర్ జోపిట్స్ ఒక తీర్మానాన్ని గతేడాది నవంబర్ లో కాంగ్రెస్ సభలో ప్రవేశపెట్టారు. తాజాగా దీనిపై న్యూజెర్సీ సెనేటర్ రష్ హోల్ట్, క్యాలిఫోర్నియా సెనేటర్ బార్బరాలీ సంతకం చేశారు. దీంతో ఈ తీర్మానానికి మద్దతిచ్చే వారి సంఖ్య 51కి చేరింది.

  • Loading...

More Telugu News