: ప్రచార రథంపై కిషన్ రెడ్డి ఫొటో లేదెందుకో?
ఎన్నికలు దగ్గర పడుతుండటంతో భారతీయ జనతా పార్టీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. హైదరాబాదులో ఇవాళ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ ప్రచారాన్ని ప్రారంభించారు. అయితే దత్తన్న ప్రచార రథంపై తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి చోటు దక్కలేదు. చంద్రబాబు ఫొటో తప్ప బీజేపీ నేతల ఫొటోలు రథంపై కనపడలేదు. సికింద్రాబాదు లోక్ సభ స్థానం నుంచి బరిలోకి దిగిన బండారు దత్తాత్రేయ మీడియాతో మాట్లాడుతూ... నరేంద్రమోడీ హవాతో కాంగ్రెస్ కొట్టుకుపోవడం ఖాయమని అన్నారు.