: అభిషేక్ బచ్చన్ 'కబడ్డీ' జట్టు


క్రీడల వ్యాపారంలోకి కొన్నేళ్ల నుంచి సినీ నటులు ప్రవేశిస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ నటీనటులు ప్రత్యేక మోజు చూపుతున్నారు. ఏదో ఒక జట్టుకు కొనుగోలు చేసి తమ ఆసక్తిని నేరవేర్చుకుంటున్నారు. తాజాగా నటుడు అభిషేక్ బచ్చన్ ఓ కబడ్డీ లీగ్ జట్టును కొనుగోలు చేశాడు. ఐపీఎల్ తరహాలో ఉండే ఈ లీగ్ లో జైపూర్ ఫ్రాంఛైజీని అభిషేక్ దక్కించుకున్నాడు.

ఈ సందర్భంగా అభి మాట్లాడుతూ, జైపూర్ ఫ్రాంఛైజీని సొంతం చేసుకున్నందుకు గర్విస్తున్నానని తెలిపాడు. కబడ్డీ ఖరీదైన ఆట కాకపోయినా, చాలా నైపుణ్యం కలిగిన ఆట అని పేర్కొన్నాడు. ఇప్పటికే ఈ ఆటకు మంచి ఆదరణ ఉందని, లీగ్ తో కబడ్డీకి మరింత పాప్యులారిటీ రావడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఈ ప్రయత్నంలో తానూ ఓ భాగమవుతున్నందుకు చాలా ఆనందంగా ఉందని అభిషేక్ చెప్పాడు. జులై 26 నుంచి ఆగస్టు 31 వరకు మ్యాచ్ లు నిర్వహిస్తారు.

  • Loading...

More Telugu News