: పరిటాల వర్గీయులను ఎందుకు అరెస్ట్ చేయలేదు?: వైకాపా
వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలతో పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై అనంతపురం జిల్లా వైఎస్సార్సీపీ సమన్వయకర్త ప్రకాష్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల తుది విడత ఎన్నికల నేపథ్యంలో, జిల్లాలోని రామగిరి, కనగానపల్లి, ఆత్మకూరు మండలాల్లోని వందలాది మంది వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు. నేరచరిత్ర కలిగిన పరిటాల రవి అనుచరులను ఒక్కరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకోలేదని విమర్శించారు. పోలీసుల వైఖరిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.