: నాకు మోడీ భయమేం లేదు: రిజర్వ్ బ్యాంక్ గవర్నర్
గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి, తనకు మధ్య ఘర్షణ నెలకొంటుందన్న వార్తలను రిజర్వ్ బ్యాంకు గవర్నర్ రఘురాం రాజన్ కొట్టిపడేశారు. ఎన్నికల అనంతరం నరేంద్రమోడీ సారథ్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పడితే రాజన్ కు కష్టకాలమేనంటూ మీడియాలో వార్తలు ప్రసారం అవుతున్నాయి. గతేడాది సెప్టెంబర్ లో రాజన్ ఆర్ బీఐ గవర్నర్ గా పగ్గాలు చేపట్టిన విషయం తెలిసిందే. అనంతరం ఆయన ఆర్థిక మంత్రి చిదంబరంతో సన్నిహితంగా ఉంటూ వస్తున్నారు. దీంతో ద్రవ్యోల్బణం విషయంలో చిదంబరం, రాజన్ అనుసరిస్తున్న విధానాలపై కొందరు బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ అధికారంలోకి వస్తే రాజన్ కు కష్టకాలమంటూ వార్తలు వస్తున్నాయి. కాగా, ఇదంతా మీడియా సృష్టేనని రాజన్ స్పష్టం చేశారు.