: ఫ్యాక్షన్ గ్రామం కప్పట్రాళ్లలో పరిస్థితి ఉద్రిక్తం


కరడుగట్టిన ఫ్యాక్షన్ కు చిరునామా అయిన కర్నూలు జిల్లా కప్పట్రాళ్ల గ్రామం స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వేడెక్కింది. టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన కార్యకర్తలు ఘర్షణకు దిగారు. మద్దిలేటి నాయుడు, వెంకటప్పనాయుడుల వర్గీయులు పోలింగ్ బూత్ లోనే పరస్పరం దాడులు చేసుకున్నారు. అలర్టయిన పోలీసులు ఇరువర్గాల వారిని చెదరగొట్టారు. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు కప్పట్రాళ్ల సర్పంచ్ దివాకర్ నాయుడును అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో, ఏ క్షణంలో ఏమి జరుగుతుందో అని గ్రామస్తులు భయాందోళనలో ఉన్నారు.

  • Loading...

More Telugu News