: జగన్ పై విరుచుకుపడ్డ కిరణ్
వైఎస్సార్సీపీ అధినేత జగన్ పై జై సమైక్యాంధ్ర పార్టీ అధినేత కిరణ్ కుమార్ రెడ్డి విరుచుకుపడ్డారు. అనంతపురం జిల్లా రోడ్ షోలో ఆయన మాట్లాడుతూ, రాజకీయాల్లోకి రాకముందే జగన్ పై అవినీతి కేసులున్నాయని తెలిపారు. వేల కోట్ల రూపాయలు జగన్ దోచుకున్నాడని ఆయన మండిపడ్డారు. జగన్ లాంటి వారికి పెద్ద పదవులు వస్తే రాష్ట్రాన్ని దేవుడే కాపాడాలని కిరణ్ కుమార్ రెడ్డి అభిప్రాయపడ్డారు.