: జయలలిత మళ్లీ కోర్టుకు హాజరుకాలేదు!
ఆదాయ పన్ను కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరోసారి కోర్టు ముందు హాజరుకాలేదు. ఈరోజు ఆమె చెన్నైలోని అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరు కావలసి ఉంది. సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో జయలలిత కోర్టుకు హాజరు కాలేదని, ఆమె ఈ విషయమై సుప్రీంకోర్టుకు దరఖాస్తు చేశారని ఆమె తరపు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. ఈ కేసును నాలుగు నెలల్లో ముగించాలని గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలను గుర్తు చేస్తూ గడువు పొడిగించవలసిందిగా కోరుతూ జయలలిత దరఖాస్తు చేశారని ఆమె తరపు లాయర్ తెలిపారు.