: కోమటిరెడ్డి వెంకటరెడ్డి విద్యార్హతలపై ఆరోపణలు
నల్గొండ అసెంబ్లీ నియోజక వర్గం కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎన్నికల అఫిడవిట్లో తన విద్యార్హతను తప్పుగా పేర్కొన్నారు. దీనిపై టీఆర్ఎస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. తక్షణం ఆయన అఫిడవిట్ తిరస్కరించాలని రిటర్నింగ్ అధికారిని కోరారు. వెంకటరెడ్డి బీటెక్ పూర్తి చేసినట్టు అఫిడవిట్ లో పేర్కొన్నారు. అయితే, ఆయన బీటెక్ పూర్తి చేయలేదని, మధ్యలోనే చదువు ఆపేశారని టీఆర్ఎస్ నేతలు, స్వతంత్ర అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. దీనిపై ఆధారాలు చూపిస్తామని సవాలు విసురుతున్నారు.