: ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ వంతు
రాష్ట్రంలో విద్యుత్ సమస్యలపై పోరాడేందుకు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వంతొచ్చింది. ఇప్పటికే వామపక్షాలు, టీడీపీ పోటాపోటీగా ఇదే అంశం మీద ధర్నాలు.. నిరాహార దీక్షలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా బీజేపీ కూడా తన ఉద్యమ ప్రణాళిక ప్రకటించింది. ఈ నేపధ్యంలో వైఎస్ఆర్ సీపీ కూడా విద్యుత్ ఉద్యమబాట పట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు మార్చి 3వ తేదీన అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు చేస్తున్నట్లు ఆ పార్టీ వెల్లడించింది. నల్గొండలో జరిగే ధర్నాలో పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ పాల్గొంటారని ఆ పార్టీ నేతలు చెప్పారు.