: టికెట్లు రాని వారికి భవిష్యత్తులో అవకాశం: పొన్నాల
ప్రస్తుత ఎన్నికల్లో టికెట్లు లభించని వారికి భవిష్యత్తులో అవకాశాలు కల్పిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. సీపీఐకి కేటాయించిన స్థానాల్లో రెబల్స్ గా బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. అరచేతిలో స్వర్గం చూపించే వారిని నమ్మవద్దని ఓటర్లకు సూచించారు.