: పాత్రికేయుడికి ప్రాణంపోసిన చంద్రబాబు


టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తన గొప్ప మనసును చాటుకున్నారు. సమస్యల్లో ఉన్నామంటూ వచ్చే వారిని ఆదరించే చంద్రబాబునాయుడు, ఓ పాత్రికేయుడికి ప్రాణదానం చేశారు. వరంగల్ జిల్లాకు చెందిన పాత్రికేయుడు బండి రవీంద్ర గత కొంత కాలంగా బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతున్నారు. ఈయన ఉత్తర తెలంగాణ హెచ్ఎంటీవీకి రీజనల్ కో అర్డినేటర్ గా పని చేస్తున్నారు.

ఇటీవల వరంగల్ జిల్లాలో జరిగిన ప్రజాగర్జన సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడ్ని కలిసి తన సమస్య వివరించి, ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. అతని సమస్య విన్న చంద్రబాబు తక్షణం అతనికి వైద్యసహాయం అందించాల్సిందిగా ఎన్టీఆర్ ట్రస్టును ఆదేశించారు. దీంతో ట్రస్టు అధికారులు అతనిని ట్రస్టు ఆధ్వర్యంలో కిమ్స్ ఆసుపత్రిలో చేర్పించి శస్త్రచికిత్స చేయించారు. ఈ విషయాన్ని వెల్లడించిన ఎన్టీఆర్ ట్రస్టు సీఈవో చుక్కా కొండయ్య, ఇందుకు సహకరించిన కిమ్స్ సీఈవో డాక్టర్ బొల్లినేని భాస్కరరావుకు ధన్యవాదాలు తెలిపారు.

  • Loading...

More Telugu News