: పోలీసుల చేతికి చిక్కిన ‘చిట్టీల’ రాణి


ఎట్టకేలకు ‘చిట్టీల’ రాణి సీసీఎస్ పోలీసుల చేతికి చిక్కింది. హైదరాబాదులో టీవీ, జూనియర్ ఆర్టిస్టుల నుంచి రూ. 10 కోట్లు వసూలు చేసుకుని ఉడాయించిన విజయరాణిని బెంగళూరులో సీసీఎస్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెతో పాటు 10 మంది బంధువులను కూడా అరెస్ట్ చేసినట్లు సీసీఎస్ పోలీసులు హైదరాబాదులో చెప్పారు. విజయరాణి ఆస్తుల వివరాలను సీసీఎస్ అధికారులు సేకరిస్తున్నారని సమాచారం. మరో రెండు రోజుల్లో విజయరాణిని మీడియా ముందు ప్రవేశపెట్టనున్నట్లు పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News