: నాపై జరిగిన దాడి బీసీలపై దాడే: ఆర్ కృష్ణయ్య
ఈ మద్యాహ్నం నామినేషన్ వేసేందుకు వెళ్లిన సందర్భంగా తనపై జరిగిన దాడి బీసీలపై జరిగిన దాడి అని టీడీపీ నేత ఆర్ కృష్ణయ్య వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లోని సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఈ సంఘటనపై ఫిర్యాదు చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై విచారించి చర్యలు తీసుకుంటామని పోలీసులు ఆయనకు హామీ ఇచ్చారు.