: ఇటలీ మెరైన్లను విచారించనున్న ఎన్ఐఏ!


ఇద్దరు ఇటలీ మెరైన్లు కేరళ తీరంలో ఇద్దరు భారత జాలర్లను కాల్చి చంపిన కేసును కేంద్ర ప్రభుత్వం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు అప్పగించనుందని సమాచారం. సముద్రపు దొంగలుగా పొరబడి వీరు భారత జాలర్లపై కాల్పులు జరిపారు. ఇటలీ మీద ఒత్తిడి తీసుకొచ్చి మరీ కేంద్ర ప్రభుత్వం వీరిని భారతదేశానికి రప్పించిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు అంతర్జాతీయంగా ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా విచారణను ఎన్ఐఏకు అప్పగించాలని ప్రభుత్వం భావిస్తోందని అధికార వర్గాలు చెబుతున్నాయి. దీనిపై వచ్చే వారంలో నోటిఫికేషన్ విడుదల అవుతుందని సమాచారం. 

  • Loading...

More Telugu News