: తెలంగాణలో నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఈ నెల 12న
తెలంగాణలో నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఈ నెల 12 అని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ భన్వర్ లాల్ తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఎన్నికల్లో పోటీ అభ్యర్థుల వాస్తవ వివరాలు ఈ నెల 12న మూడు గంటల తరవాత తెలుస్తాయని అన్నారు. ఎవరైనా అభ్యర్థులు నామినేషన్లు వెనక్కి తీసుకోవాలంటే ఈ నెల 12 మూడు గంటల్లోపు వాపస్ తీసుకోవచ్చని ఆయన సూచించారు.