: ఎన్నికల్లో గెలవాలనుందా?...అయితే, వధువును వెతికిపెట్టండి!
సీత బాధలు సీతవి, పీతబాధలు పీతవి అన్నట్టు ఎన్నికల్లో గెలవాలనే ఆలోచనలో అభ్యర్థులు ఉండగా, 'మీకు ఓటేయాలంటే మాకు వధువును వెతికిపెట్టండి' అంటూ బంపర్ ఆఫర్ ఇస్తున్నారు హర్యానాలోని యువకులు. హర్యానా రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో స్త్రీ, పురుష నిష్పత్తి మధ్య భారీ వ్యత్యాసముంది. అక్కడి యువకులకు అమ్మాయిలు దొరకడం లేదు. దీంతో చాలా మంది పెళ్లికాని ప్రసాదులుగా మిగిలిపోతున్నారు. వీరంతా ఓటడిగేందుకు వస్తున్న నేతలతో "ముందు మాకు వధువులను వెదికి తరువాత ఓటడగండి" అంటూ డిమాండ్ చేస్తున్నారు. దీంతో అభ్యర్థులు బెంబేలెత్తిపోతున్నారు. పరువు హత్యలు, భ్రూణ హత్యలు హర్యానాలో జరుగుతుండడం గమనార్హం.