: సుబ్రతోను హౌస్ రిమాండులో ఉంచాలన్న సహారా విజ్ఞప్తి తిరస్కరణ


సహార గ్రూపుల సంస్థ అధినేత సుబ్రతోరాయ్ ను తీహార్ జైల్ నుంచి విడుదల చేసేందుకు ఆ సంస్థ చేసిన మరో ప్రయత్నం విఫలమైంది. సుబ్రతోను విడుదల చేసి, హౌస్ రిమాండులో ఉంచాలంటూ ఆ సంస్థ అధికారులు చేసిన అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. రాయ్ బెయిల్ కోసం డిపాజిట్ చేయాల్సిన నగదు సమకూర్చటంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సహారా తెలిపింది. ఇదే సమయంలో అంతర్జాతీయ కొనుగోలుదారుల ద్వారా తమ ఆస్తులు అమ్మి డబ్బు సేకరించేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నామని అయితే, జైల్లో ఉన్న సుబ్రతోతో ఒప్పందం కుదుర్చుకునేందుకు ఎవరూ ఇష్టపడటం లేదని వారి తరపు న్యాయవాది రామ్ జెఠ్మలానీ కోర్టుకు వివరించారు.

  • Loading...

More Telugu News