: శంషాబాద్ విమానాశ్రయంలో 13 కేజీల బంగారం పట్టివేత
హైదరాబాదు శంషాబాద్ విమానాశ్రయం స్మగ్లింగ్ కు అడ్డాగా మారిపోతోంది. విమానాశ్రయంలో పెద్ద ఎత్తున పట్టుబడుతున్న బంగారం అధికారులను విస్తుపోయేలా చేస్తోంది. తాజాగా 13 కిలోల బంగారం అక్రమ రవాణా చేస్తూ ఓ మహిళ పట్టుబడింది. ఆమెను మహారాష్ట్రకు చెందిన మహిళగా పోలీసులు గుర్తించారు. ఆమె నుంచి 13 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు ఆమెను విచారిస్తున్నారు.