: అమితాబ్ ప్రేమంటే ఇదే


తన భార్య పట్ల తనకున్న ఇష్టాన్ని అమితాబ్ చేతల్లో చూపించారు. అమితాబ్ నటించిన 'బూత్ నాథ్ రిటర్న్స్' చిత్ర ప్రచార కార్యక్రమం ఈ రోజు ఢిల్లీలో జరిగింది. అందులో అమితాబ్ పాల్గొనడమే కాకుండా వెంటనే విమానంలో ముంబైకి పయనం అయ్యారు. అక్కడ తన సతీమణి జయాబచ్చన్ పుట్టిన రోజు పండగలో పాల్గొనాల్సి ఉందని ఆయనే స్వయంగా తన బ్లాగులో పేర్కొన్నారు. ఈ రోజు రాత్రి అమితాబ్ కుమారుడు అభిషేక్, కోడలు ఐశ్వర్య, మనవరాలు ఆరాధ్య, కూతురు శ్వేతానంద, అల్లుడు నిఖిల్ నందా, వారి పిల్లలు నవ్య, అగస్త్యలతో కలసి జయాబచ్చన్ కు ఈ రోజు రాత్రి ముంబైలో పుట్టినరోజు విందు ఇవ్వనున్నారు. అందరితో ఈ రోజు తన నివాసం సందడిగా ఉందని అమితాబ్ వెల్లడించారు.

  • Loading...

More Telugu News