: మోడీ గీడీ అంటారు...మోడీ మద్దతు కావాలంటారు... టీఆర్ఎస్ పై వెంకయ్య మండిపాటు


టీఆర్ఎస్ నేతల వైఖరిపై బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు మండిపడ్డారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, 'మోడీ లేడు గీడీ లేడు' అని కేసీఆర్ ఇష్టమొచ్చినట్టు మాట్లాడతాడు. మరోపక్క మోడీ మద్దతు కావాలని అంటారు. అదెలా సాధ్యమవుతుందని వెంకయ్య ప్రశ్నించారు. టీఆర్ఎస్ నేతలు ద్వంద్వ వైఖరితో మాట్లాడుతున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ నేతల తీరును తమ పార్టీ వారు ప్రశ్నించడం లేదని, తమ పార్టీ ఏర్పాటు చేసుకున్న పొత్తులపై తాము ఆలోచించుకోగలమని, టీఆర్ఎస్ పార్టీ నేతలు ఆ పార్టీ గురించి ఆలోచించుకుంటే బాగుంటుందని ఆయన హితవు పలికారు. బీజేపీ, టీడీపీ పొత్తుపై హరీష్ రావు, కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News