: నన్ను గెలిపిస్తే ఖమ్మాన్ని అభివృద్ధి చేస్తా: నారాయణ


తనను గెలిపిస్తే ఖమ్మం జిల్లా అభివృద్ధికి పాటుపడతానని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ హామీ ఇచ్చారు. ఖమ్మం లోక్ సభ స్థానం నుంచి ఆయన పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఉదయం ఖమ్మం పట్టణంలోని పెవిలియన్ గ్రౌండ్ లో జాగింగ్ కోసం వచ్చిన వారిని కలిసి తనకు ఓటు వేసి గెలిపించాలని నారాయణ కోరారు. పార్టీలు మార్చే నాయకుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

  • Loading...

More Telugu News