: అధికారం ఎన్డీయేదే: అద్వానీ
ఈ సారి ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ సీనియర్ నేత ఎల్ కే అద్వానీ అన్నారు. తిరువనంతపురంలో ఆయన మాట్లాడుతూ, లోక్ సభ ఎన్నికల తరువాత ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందోననే సందేహం అనవసరమని అన్నారు. ఎన్డీయే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి చరిత్ర సృష్టిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.