: కేరళలో యూడీఎఫ్, ఎల్‌డీఎఫ్ కుమ్మక్కు: మోడీ
కేరళ రాష్ట్రంలో యూడీఎఫ్, ఎల్‌డీఎఫ్ లోపాయికారీ ఒప్పందాలు కుదుర్చుకున్నాయని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ఆరోపించారు. నేరుగా బీజేపీని ఎదుర్కొనే ధైర్యం లేక ప్రత్యర్థులు కుమ్మక్కయ్యారని ఆయన ఆరోపించారు. ఇవాళ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మోడీ కేరళలోని కాసర్ గూడలో భారత్ విజయ్ ర్యాలీలో పాల్గొని ప్రసంగించారు. యూపీఏ పాలిత రాష్ట్రాల్లోనే మహిళలపై అత్యాచారాలు అధికమవుతున్నాయని ఆయన దుయ్యబట్టారు. కేరళలో ఉద్యోగాలు లేక యువకులంతా గల్ఫ్ దేశాలకు వలస పోతున్నారని ఆయన అన్నారు.