: చేవెళ్ల చెల్లెమ్మ కల చెదిరింది... కథ మారింది!


ఒకప్పుడు రాష్ట్ర హోం శాఖామంత్రిగా చక్రం తిప్పిన చేవెళ్ల చెల్లెమ్మ సబిత కల చెదిరింది. సబితా ఇంద్రారెడ్డికి కాంగ్రెస్ మొండి‘చెయ్యి’ చూపించింది. కుటుంబానికి ఒకటే టికెట్ అన్న సూత్రాన్ని అనుసరించి చేవెళ్ల లోక్ సభ స్థానాన్ని సబిత కుమారుడు కార్తీక్ రెడ్డికి కేటాయించిన అధిష్ఠానం, సబితారెడ్డికి మాత్రం టిక్కెట్ ఇవ్వలేదు. పోనీ, తనకివ్వకపోయినా తనవాళ్లలో ఎవరికైనా ఇస్తే ఎలాగోలా చేవెళ్ల పార్లమెంటరీ స్థానం నుంచి కార్తీక్ రెడ్డిని గెలిపించుకోచ్చని అనుకుంటే ఆ విషయంలోనూ ఆమెకి నిరాశే ఎదురైంది.

సబితా ఇంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మహేశ్వరం నియోజకవర్గాన్ని పొత్తులో భాగంగా సీపీఐకి కేటాయించారు. ఇది తన తనయుడి విజయావకాశాలను దెబ్బతీస్తుందని ఇప్పుడు చేవెళ్ల చెల్లెమ్మ ఆందోళన చెందుతున్నారు. దానికి తోడు, ఈసారి రాజేంద్రనగర్ నుంచి తాను బరిలోకి దిగుదామని ఆమె అనుకొన్నారు. దానికి కూడా అధిష్ఠానం అంగీకరించలేదు. పోనీ, తన వర్గం వారికైనా దక్కుతుందనుకొంటే, అది కాస్తా సబిత వైరి వర్గానికి చెందిన జ్ఞానేశ్వర్ ముదిరాజ్ కు కేటాయించడం ఆమెనిప్పుడు అమితంగా బాధిస్తోంది.

  • Loading...

More Telugu News