: మమత ధిక్కారం... ఏం జరగుతుందో?
ఎన్నికల నేపథ్యంలో పశ్చిమబెంగాల్లో ఆరుగురు అధికారులను బదిలీ చేయాలంటూ ఎన్నికల సంఘం(ఈసీ) అల్టిమేటం జారీ చేసినా ఆ రాష్ట్ర సీఎం మమతా దిగిరాలేదు. అధికారులను బదిలీ చేయడం కుదరదని, ఈసీ తన నిర్ణయాన్ని మరోసారి సమీక్షించుకోవాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం కోరింది. మరోవైైపు ఈ రోజు మధ్యాహ్నం 2.30గంటల్లోపు అధికారులను బదిలీ చేయకుంటే ఎన్నికలను వాయిదా వేస్తామని ఈసీ హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏ పరిణామాలు జరగుతాయోనన్న ఉత్కంఠ నెలకొంది.