: ఆర్టీసీ బస్సు కన్నంలోంచి జారిపడి ఎనిమిదేళ్ల బాలిక మృతి


ఆర్టీసీ తీరుకు నిలువుటద్దం ఈ సంఘటన...మహబూబ్ నగర్ జిల్లా ముక్తల్ కు చెందిన గోవిందమ్మ తన కుమార్తెలతో కలిసి నారాయణపేట నుంచి ముక్తల్ కు ఆర్టీసీ బస్సులో బయల్దేరింది. కూర్చున్న దగ్గర బస్సు కింది భాగంలో రంధ్రం ఉండడం గమనించని గోవిందమ్మ కుమార్తె ప్రమాద వశాత్తు అందులోంచి జారి కింద పడిపోయింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన స్వాతి అక్కడికక్కడే మృతి చెందింది. దీనిపై కేసు నమోదు చేసినట్టు ఉట్కూరు ఎస్సై సంపత్ కుమార్ తెలిపారు. బాలిక మృతదేహాన్ని నారాయణపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు.

  • Loading...

More Telugu News