: కాంగ్రెస్, టీడీపీ దొందుదొందే: కవిత
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రైతు వ్యతిరేకి అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆరోపించారు. నిజామాబాద్ లో ఆమె మాట్లాడుతూ, తెలంగాణలో షుగర్ ఫ్యాక్టరీలను తెగనమ్మి రైతులు, కార్మికుల పొట్టకొట్టారని దుమ్మెత్తిపోశారు. 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి ఉంటే ఉద్యమ త్యాగాలను ఆపేవారని అన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం వందల మంది ప్రాణాలను కాంగ్రెస్ పార్టీ బలితీసుకుందని ఆమె విమర్శించారు. ప్రజా సంక్షేమంలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు దొందుదొందేనని అన్నారు.