: తొలి మ్యాచ్ కు ధావన్ దూరం
సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తోన్న టీమిండియా నయా సంచలనం శిఖర్ ధావన్.. ఐపీఎల్ తాజా సీజన్ లో తన జట్టు ఆడే తొలి మ్యాచ్ కు దూరం కానున్నాడు. ఆసీస్ తో సిరీస్ సందర్భంగా చేతి వేళ్ళకు గాయమవడంతో ధావన్ చివరి టెస్టు నుంచి వైదొలగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ధావన్ కోలుకుంటున్నాడు.
సన్ రైజర్స్ జట్టు ఏప్రిల్ 5న తన తొలి మ్యాచ్ ను పుణే వారియర్స్ తో తలపడనుంది. ఈలోగా ధావన్ జట్టుకు అందుబాటులోకి వచ్చే అవకాశాలు పెద్దగా కనిపించడంలేదు. కాగా, హైదరాబాద్ యాజమాన్యం మరో రెండు వారాల్లో ధావన్ జట్టులో చేరతాడని ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఆసీస్ తో సిరీస్ లో టెస్టు అరంగేట్రం చేసిన ఢిల్లీ డైనమైట్ ధావన్ తొలి మ్యాచ్ లోనే శతకం బాది రికార్డులు తిరగరాసిన సంగతి తెలిసిందే.