: రాజకీయాల్లోకి రావాలా? వద్దా? అనేది 12 న నిర్ణయిస్తా: అశోక్ బాబు


తన రాజకీయ భవితవ్యంపై ఈ నెల 12 న నిర్ణయం తీసుకుంటానని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు తెలిపారు. తణుకులో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర విభజనకు కారణమైన పార్టీలకు తగిన బుద్ధి చెబుతామని అన్నారు. ఉద్యోగ వ్యవస్థపై రాజకీయ ప్రాబల్యం తగ్గించాలని అన్ని రాజకీయ పార్టీలను కోరామని ఆయన తెలిపారు. శాఖల విలీనం ద్వారా ఉద్యోగులకు అన్యాయం జరిగితే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. సీమాంధ్ర రాజధాని తరువాత ఉద్యోగులకు ఆప్షన్లు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని ఆయన కోరారు.

  • Loading...

More Telugu News