: నన్నెవరూ కిడ్నాప్ చేయలేదు...నేను క్షేమం: నాగం
తాను క్షేమంగా ఉన్నానని...తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని బీజేపీ నేత నాగం జనార్థనరెడ్డి తెలిపారు. హైదరాబాదు, గచ్చిబౌలిలోని ఆయన నివాసంలో మాట్లాడుతూ, తనను కిడ్నాప్ చేసినట్టు వచ్చిన వార్తలు అవాస్తవమని అన్నారు. స్కార్పియో వాహనంలో కొందరు దుండగులు వచ్చి, స్మోక్ బాంబు విసిరి, తుర్క్ యాంజిల్ వద్ద నాగం జనార్థనరెడ్డిని కిడ్నాప్ చేసినట్టు పుకార్లు షికారు చేశాయి. నాగర్ కర్నూల్ ఎమ్మెల్యేగా ఉన్న జనార్థనరెడ్డి బీజేపీ తరపున మహబూబ్ నగర్ లోక్ సభ స్థానానికి పోటీ చేయనున్నారు.