: అమీర్ ఖాన్ తో నటించడమే లక్ష్యం కాదు: కంగనా రనౌత్
బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ తో నటించడమే తన లక్ష్యం కాదని బ్యూటీ ‘క్వీన్’ కంగనా రనౌత్ చెప్పింది. ‘క్వీన్’ సినిమాతో ఆమె అభిమానులు, సహనటుల్నే కాదు... విమర్శకుల్ని సైతం మెప్పించింది. క్వీన్ లో నటన చూసిన తర్వాత కంగనతో నటించాలని ఉందని అమీర్ తన మనసులో మాటను వెల్లడించాడు.
అమీర్ వ్యాఖ్యలపై స్పందిస్తూ... ‘‘ఇప్పటికిప్పుడే ఓ చిత్రంలో నటించడం కుదరని పని’’ అని కంగనా అంది. అందర్నీ ఆకట్టుకునే కథ దొరికితే, ఇద్దరం కలిసి నటించే అవకాశం కోసం ఎదురుచూస్తానని ఆమె తెలిపింది. క్వీన్ చిత్రం తర్వాత కంగనా 'రివాల్వర్ రాణి' చిత్రంలో నటించింది. ఈ సినిమా ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.