: హాలీవుడ్ నటుడు మిక్కీ రూనీ మృతి
ప్రముఖ హాలీవుడ్, టీవీ నటుడు మిక్కీ రూనీ (93) మృతి చెందారు. నటుడిగా, సంగీతకారుడిగా సుదీర్ఘ ప్రస్థానాన్ని సాగించిన ఆయన బహుముఖప్రజ్ఞాశాలిగా పేరుగాంచారు. 1930, 40 దశకాల్లో పలు సినిమాల్లో నటించిన రూనీ, పదేళ్ల వయసులో బాలనటుడిగా సినీ రంగప్రవేశం చేశారు. పలు సినిమాల్లో నటించి పేరుప్రఖ్యాతులు సంపాదించిన రూనీ, వృద్ధాప్యంలో తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యారు. ఆయన తుదిశ్వాస విడిచే సమయంలో ఆయన కుటుంబ సభ్యులు ఆయన పక్కనే ఉన్నారు.