: బావ ఎక్కడ ఇస్తే అక్కడి నుంచే: బాలకృష్ణ
టీడీపీ అధినేత, తన బావ చంద్రబాబు ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు సినీ హీరో బాలకృష్ణ చెప్పారు. బాలయ్య ఈరోజు యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఆయన వెంట దర్శకుడు బోయపాటి శ్రీను కూడా ఉన్నారు. స్వామివారిని దర్శనం చేసుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరపున ప్రచారం చేస్తానని చెప్పారు.