: నీలేకని తరపున బెంగళూరులో నేడు రాహుల్ ప్రచారం
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నేడు బెంగళూరులో నిర్వహించనున్న ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. పార్టీ తరపున బెంగళూరులోని వివిధ ప్రాంతాల నుంచి లోక్ సభ బరిలో ఉన్న నందన్ నీలేకని, రిజ్వాన్ అర్షద్, సి.నారాయణ స్వామి తరపున ఆయన ప్రచారం చేయనున్నారు. ఈ సాయంత్రం అక్కడి నేషనల్ కళాశాలలో ఏర్పాటుచేసే భారీ బహిరంగ సభలో రాహుల్ ప్రసంగిస్తారు. ప్రధానంగా దక్షిణ బెంగళూరు నుంచి పోటీ చేస్తున్న నీలేకనీకి ఓటు వేసి గెలిపించాలని ప్రజలను విజ్ఞప్తి చేయనున్నట్లు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు.